![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -411 లో.. ఎక్కడ శోభనం గదిలో మొహం మీదే నువ్వు అంటే ఇష్టం లేదని ఆదర్శ్ తో ముకుంద చెప్తుందోనని కృష్ణ, మురారి డల్ గా ఇంటికి వస్తారు. అలా రావడం చూసి ఏమైందని రేవతి అడుగుతుంది. మీ అబ్బాయి నన్ను డ్రింక్ చేసి కొట్టాడని కృష్ణ అనగానే.. మురారితో పాటు అందరు షాక్ అవుతారు. ఏ తింగరి ఏం మాట్లాడుతున్నావ్.. అన్ని అబద్దాలు చెప్తుందని మురారి అంటాడు.
ఆ తర్వాత కృష్ణ గదిలోకి వెళ్తుంది. ఏమైంది వీళ్ళకి కృష్ణని మురారి కొట్టడమేంటని రేవతి అనుకుంటుంది. చూస్తుంటే ఈ శోభనం కూడా క్యాన్సిల్ అయ్యేలా ఉందని మధు అంటాడు. ఆ తర్వాత కృష్ణ గదిలోకి వెళ్ళగానే.. మురారి వెళ్లి ఎందుకు అలా చెప్పావ్? నాపై మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఎవరు నమ్మరని మురారి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ శోభనం గదిలో ఆదర్శ్ కి నిజం తెలిస్తే పరిస్థితి ఏంటని కృష్ణ అంటుంది. ఇప్పటివరకు ముకుంద తనపై ఏది రాకుండా శోభనం ఆపించేయ్యాలని చూసింది. ఇప్పుడు నీక్కూడా తెలిసిందని తెలిస్తే.. ఎంతకైనా తెగిస్తుంది. నేను వెళ్లి ఆదర్శ్ తో శోభనం వాయిదా వెయ్యమని అడుగుతానన కృష్ణకి మురారి చెప్తాడు. మరొకవైపు ఈ శోభనం ఎలా ఆపాలని ముకుంద టెన్షన్ పడుతుంది. గీతిక చెప్పినట్టు చేస్తే ఈ శోభనం ఆగిపోతుంది కానీ ఒకవేళ ఆదర్శ్ నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తే ఏం చెయ్యాలని ముకుంద అనుకుంటుంది.
ఆ తర్వాత ఆదర్శ్ దగ్గరికి మురారి వస్తాడు. ముకుందని అర్థం చేసుకోవాలి. బాగా చూసుకోవాలని చెప్పాగానే నాకు తెలుసు రా నా గురించి బాగా ఆలోచిస్తావంటూ.. అసలు విషయం మురారిని చెప్పనివ్వడు. వాళ్ళ మాటలన్ని ముకుంద దూరం నుండి వింటుంది. శోభనం చెడగొట్ట అంటే ఎంకరేజ్ చేస్తున్నాడని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత మురారి వెళ్లి కృష్ణకి.. ఆదర్శ్ అసలు శోభనం వాయిదా వేద్దామనే విషయం చెప్పనివ్వలేదని మురారి అంటాడు. దాంతో కృష్ణ ఇంక టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో ఆదర్శ్ ఇచ్చిన పాలు తాగనని ముకుంద చెప్తుంది. అవే మురారి ఎంగిలి పాలు ఇస్తే తాగేదాన్ని ఇంక మురారిని మర్చిపోలేదని ముకుంద చెప్పగానే ఆదర్శ్ బయటకు వచ్చి.. రేయ్ మురారి రారా బయటకు అంటు పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |